సృష్టి స్థితి లయకర్తలకే ఆధారమాదిశక్తియని
స్త్రీమూర్తని పూజించే పుణ్యభారతావనిలో
ఆడపుటకరిష్టమనే దుష్ట సాంప్రదాయమా
పుట్టినా బ్రతికి బట్టకట్టడమే గగనమా ?
స్త్రీమూర్తని పూజించే పుణ్యభారతావనిలో
ఆడపుటకరిష్టమనే దుష్ట సాంప్రదాయమా
పుట్టినా బ్రతికి బట్టకట్టడమే గగనమా ?
|| సృష్టి
తనువు మనసు నీదని తనవారిని వదలుకొని
దైవముగా నమ్మి నిన్ను దరిజేరిన అర్థాంగిని
కట్నమివ్వలేదని కాల్చిచంపుటే ధర్మం?
స్త్రీశోకం శాపమై దహించివేయు సర్వస్వం
దైవముగా నమ్మి నిన్ను దరిజేరిన అర్థాంగిని
కట్నమివ్వలేదని కాల్చిచంపుటే ధర్మం?
స్త్రీశోకం శాపమై దహించివేయు సర్వస్వం
|| సృష్టి
పేగుతెంచి స్తన్యమిచ్చి పెంచిపెద్దచేయి తల్లి
ప్రేమపంచి బ్రతుకంతా ధారపోయు నీకె భార్య
తల్లిభార్యలేని బ్రతుకు తలపోయగ నీ తరమా?
స్త్రీమన్నన పొందు చోటే సిరులు దొరలు తెలుయుమా?
ప్రేమపంచి బ్రతుకంతా ధారపోయు నీకె భార్య
తల్లిభార్యలేని బ్రతుకు తలపోయగ నీ తరమా?
స్త్రీమన్నన పొందు చోటే సిరులు దొరలు తెలుయుమా?
0 comments:
Post a Comment