బాలల్లారా ! భావి భారత పౌరుల్లారా !
భాగ్య విధాతలు మీరే - భారత
భాగ్య విధాతలు మీరే !!
ఏ గురువు వల్ల ఏకలవ్యుడంతటి విలుకాడయ్యాడు ?
ఏ చదువు వల్ల సిద్దార్థుడు బుద్ధప్రసిద్ధిని పొందాడు
మరువకండి విద్యాబుద్ధులే మీ ప్రగతికి సోపానాలు
మీ చిరునవ్వులే జాతికి చెరగని సిరిసంపదలు
ఏ మహిమ వల్ల గగనాల తారగ వెలగెను ధృవుడు
ఏ శక్తి వల్ల మృత్యువు నెదిరించె మార్యండేయుడు
ఆ మహనీయుల ఆదర్శంగా అడుగు ముందుకేయాలి
బాపు, చాచా, నేతాజీల బంగారు కలలు పండించాలి