అతడు: ఏకాంత సమయము, ఇంకేల బిడియము ?
అందించు అందము, అలరించు డెందము
ఆమె: కథలేవో అల్లకు, కౌగిళ్ళ చేరకు
నా బుగ్గ గిల్లకు, నును సిగ్గు దోచకు
ఏకాంత||
అతడు: అయ్యారె చిత్రము, ఆ కళ్ళే మంత్రము
మురిపించు అందము, ముంగాళ్ళ బంధము
ఆమె: కొంగుపట్టు లాగకు, గుండె తట్టి లేపకు
చెంప చెంప రాయకు, చిచ్చు నాలో రేపకు
ఏకాంత||
అతడు: విరహాల వేడిలో కరిగేను కాలము
నీ ప్రణయదాసుని కరుణించి బ్రోవుము
ఆమె: ప్రణయానుబంధము, పులకించు హృదయము
ఎంతెంత మధురము, దిగివచ్చె స్వర్గము
ఏకాంత||