బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Friday, March 20, 2026

శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు !

 March 20, 2026     పద్యాలు     No comments   

కడలియలయై పరాభవ కదిలి వచ్చె,
గతము దిగమ్రింగి కొంగ్రొత్త కాంతి దెచ్చె,
భవితపై యాశ చివురించి పరిఢవిల్ల,
సకలశుభములు కలిగించు సర్వులకును.

బ్రతుకుసారమంత పచ్చడిలో జూపి,
కష్టసుఖముల సమదృష్టి నేర్పి,
విజయమొందనాత్మ విశ్వాసమిచ్చు ను
గాది పండుగ యని ఘనత గాంచె.

గల్ఫులో చిచ్చు జగమంత కమ్ముకొనియె,
గ్యాసు పెట్రోలు లేక యిక్కట్టు లాయె,
రాకపోకలాగె పనులు లేకపోయే,
పొయ్యి వెలగక పస్తులు పోవు టాయె.

బలమదంబు హెచ్చ ప్రపంచ మేలదలచి,
కౄరదాడుల దేశాలు కూలగొట్టు,
ట్రంపు నణగించు ఘోర పరాభవమ్ము,
నీ పరాభవవత్సరంబిచ్చు కనుడి

క్రొత్త సంవత్సరము తీర్చు కోర్కె లెల్ల,
నాయు రారోగ్య సౌభాగ్య మంద జేయు,
దయయు ధర్మమ్ము చేబూను జయము కల్గు,
సంశయించక ముందుకు సాగి పొమ్ము.

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
కొత్తవి పాతవి హోం

ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • ప్రేమ
    వె న్నెల కురిసెలె , వలపులు విరిసెలె మమతల మాధురిలో మనసులు మురిసెలె                                                             ...
  • మేలుకొలుపు
    శే షాద్రిపై నెలకొన్న శ్రీనివాసా ! ఈ ధాత్రి విషయమై మరచినావా ! నిత్యధూప దీపనైవేద్యాల నిరంతర స్తొత్ర సంకీర్తనల నిను గొల్చి మెప్పించి నీ...

భాండాగారం

  • ▼  2026 (2)
    • ▼  March (1)
      • శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు !
    • ►  January (1)
  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates