శ్రీ బెల్లంకొండ రత్నం గారు వారి నాన్నగారి పై వ్రాసిన శతకం ఇది. ప్రతి పద్యంలోను వారి నాన్నగారి మీద ఆయనకున్న అవ్యాజమైన అనురాగం, వారితో ఆయన పంచుకున్న మధురానుభూతులు, చెరిగిపోని జ్ఞాపకాలు ప్రతిఫలిస్తాయి.
Smruthyanjali by Rathnam Bellamkonda
శ్రీ బెల్లంకొండ రత్నం గారు వారి నాన్నగారి పై వ్రాసిన శతకం ఇది. ప్రతి పద్యంలోను వారి నాన్నగారి మీద ఆయనకున్న అవ్యాజమైన అనురాగం, వారితో ఆయన పంచుకున్న మధురానుభూతులు, చెరిగిపోని జ్ఞాపకాలు ప్రతిఫలిస్తాయి.
శ్రీ బెల్లంకొండ రత్నం రచించిన రుక్మిణీ కళ్యాణం నాటకం ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి.
చెట్టే మనిషికి జీవనాధారము
చెట్లను పెంచితే కలుగు సౌభాగ్యము
చెట్టే మనిషికి జీవనాధారము
చెట్లను పెంచితే కలుగు సౌభాగ్యము
చెట్టే మనిషికి జీవనాధారము
చెట్లను పెంచితే కలుగు సౌభాగ్యము
మండుటెండ మరపించి నీడ సేదనలరించు
మేఘాలను మురిపించి వర్షాలను కురియించు
మండుటెండ మరపించి నీడ సేదనలరించు
మేఘాలను మురిపించి వర్షాలను కురియించు
కాలుష్యము హరియించి ప్రాణవాయువందించు..ఆ..ఆ
కాలుష్యము హరియించి ప్రాణవాయువందించు
అన్న,వస్త్ర, మౌషధమై ఆయువృద్ధి గావించు
అన్న,వస్త్ర, మౌషధమై ఆయువృద్ధి గావించు
|| చెట్టే మనిషికి
అందం ఆనందం అభివృద్ధికి చెట్లాధారం
చెట్టు లేని ఎడారిలోన మోడు వారు జనజీవం
అందం ఆనందం అభివృద్ధికి చెట్లాధారం
చెట్టు లేని ఎడారిలోన మోడు వారు జనజీవం
పచ్చదనం విస్తరించి ఫలపుష్పభరితమై ..ఆ..ఆ
పచ్చదనం విస్తరించి ఫలపుష్పభరితమై
భువి నందనవనమైతే
దివి నేలకు దిగు తథ్యం
భువి నందనవనమైతే
దివి నేలకు దిగు తథ్యం
|| చెట్టే మనిషికి