పరిశుభ్రత పచ్చదనం ప్రగతి చాటు సంకేతం !
ఆ లక్ష్యం సాధించగ దీక్ష బూని సాగుదాం !
దీక్ష బూని సాగుదాం !
|| పరిశుభ్రత పచ్చదనం
నిన్ను నీవు శుభ్రముగా ఉంచుకుంటే చాలదు,
వీధి వాడ బాధ్యత నీది కాదు అనరాదు,
నిన్ను నీవు శుభ్రముగా ఉంచుకుంటే చాలదు,
వీధి వాడ బాధ్యత నీది కాదు అనరాదు,
పరిసరాలు శుభ్రమైతే దరికి రావు రోగాలు
పరిసరాలు శుభ్రమైతే దరికి రావు రోగాలు
పచ్చదనం రంగరిస్తే పల్లవించు భోగాలు,
పల్లవించు భోగాలు !!
|| పరిశుభ్రత పచ్చదనం
వీధి వెంట పచ్చదనం వాకిటలో తోరణం,
ఊరువాడ వృక్షధనం బృందావన శోభితం,
వీధి వెంట పచ్చదనం వాకిటలో తోరణం
ఊరువాడ వృక్షధనం బృందావన శోభితం,
అన్నప్రాణవాయుదాత మన మనుగడకాధారం !
అన్నప్రాణవాయుదాత మన మనుగడకాధారం !
పచ్చదనం భూమి నింపి భవితను రక్షించుదాం !
భవితను రక్షించుదాం !!
ఈ పాటను క్రింది లంకెలో వినండి