చుట్టు పరిసరాలు శుభ్రముగా ఉంచుకో !
చెట్టు చేమలతో పచ్చదనం నింపుకో !
ప్రకృతి సమతుల్యం పదిలంగా చూసుకో !
భువిని నీ ఉనికి కి భద్రతిదే తెలుసుకో !
విచ్చలవిడి విసర్జన వ్యాధులంట జేయును,
పారవేయు చెత్తలోన సిరులు పొందవచ్చును,
మట్టిగానీ ప్లాస్టీకులు వలదు, హాని కలుగును,
ముందుచూపు ఉంటె చాలు మనుగడ సుఖవంతమౌను,
వాహన పరిశ్రమల వెలువడు వాయువులు,
సేల నీటి వనరుల కలయు విషపదార్థములు,
సకల జీవరాసులు సమసిపోవు ప్రమాదములు,
శాస్త్రీయ నిర్వహణల సమకూరును శుభములు,
అడవుల స్వార్థానికి ఆహుతిగా చేయకుము,
సామాజిక వనవృద్ధికి సహకరించ మరువకుము,
పర్యావరణ రక్షణలో పుడమి తల్లి క్షేమము,
పుడమి తల్లి వొడిలొనే మన బ్రతుకులు పదిలము.