బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Friday, August 17, 2018

అన్నమాచార్య

 August 17, 2018     నాటికలు     No comments   




అన్నమయ్య అనగానే ఒక గొప్ప వేంకటేశ్వరస్వామి భక్తుడని,సంకీర్తనాచార్యుడని మనకందరికీ తెలుసు. కానీ ఆయన జీవిత విశేషాలు , పూర్తి రచనలు, శ్రీవారికి ఆయన ప్రవేశపెట్టిన కైంకర్యాలు గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు. అన్నమయ్య మూల కథకు సహజ వ్యక్తిత్వానికి భిన్నంగా ఈ మధ్య వచ్చిన కల్పనలను వాస్తవాలనే భ్రమనుండి సామాన్యులు బయటపడాలంటే సాధికారమనదగ్గ సరిక్రొత్త కళారూపాలు, నాటకాలు , విరివిగా రావలసిన అవసరముంది. ఆ దిశగా శ్రీ రత్నం గారు చేసిన ప్రయత్నమే  ఈ "అన్నమాచార్య"  పద్య నాటకం.

పలు గ్రంథాలను పరిశీలించి, ప్రముఖ పండితులను సంప్రదించి, అన్నమయ్య మనుమడు చినతిరువేంగళనాథుడు (చిన్నన్న) రచించిన " శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జీవిత చరిత్ర " దానికి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పీఠికను ఆధారం చేసుకొని, నాటి చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, మూలకథకు పాత్రల ఔచిత్యానికి భంగం కలుగకుండా సహజత్వాన్ని ప్రతిబింబించే సన్నివేశాలతో శ్రీరత్నం గారు అన్నమాచార్య నాటకాన్ని రచించారు. అన్నమయ్య సమగ్ర జీవిత చరిత్రతో పాటు, ఆయన కీర్తనల వైవిధ్యం , ఆంతర్యం, అంతరార్థం, సామాజిక ప్రయోజనం ఇవన్నీ వివరించే ప్రయత్నం చేశారు.

శ్రీ రత్నంగారే దర్శకత్వం వహించి ప్రదర్శించిన ఈ నాటకం 2013లో జరిగిన గరుడ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలలో "ఉత్తమ రచన" అవార్డు పొందింది.



ఈ నాటకంలోంచి ఓ సన్నివేశం క్రింది ఫోటోలో చూడండి.


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
కొత్తవి పాతవి హోం

0 comments:

Post a Comment


ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • ప్రేమ
    వె న్నెల కురిసెలె , వలపులు విరిసెలె మమతల మాధురిలో మనసులు మురిసెలె                                                             ...
  • మేలుకొలుపు
    శే షాద్రిపై నెలకొన్న శ్రీనివాసా ! ఈ ధాత్రి విషయమై మరచినావా ! నిత్యధూప దీపనైవేద్యాల నిరంతర స్తొత్ర సంకీర్తనల నిను గొల్చి మెప్పించి నీ...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...

భాండాగారం

  • ►  2026 (1)
    • ►  January (1)
  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ▼  August (1)
      • అన్నమాచార్య
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates