బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Sunday, April 8, 2018

రుక్మిణీ కల్యాణం

 April 08, 2018     నాటికలు     No comments   

శ్రీమద్భాగవతంలోని అనేక రసవద్ఘట్టాలలో రుక్మిణీ కల్యాణం ఒకటి.

 భక్తితో పాటు ప్రేమ, ఆరాధన, అనుబంధాలు ఇందులో ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. పరమాత్వ తత్వంతో పాటూ, జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని మారుతున్న కాలపరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో ఉంచుకొని సరళమైన పద్య సౌందర్యంతో, సర్వ జనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది తెరకెక్కించే ప్రయత్నం చేశారు శ్రీ రత్నంగారు.


 ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.

 జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి,దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.

సీ||

 సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనువేల
మోహనాకార ! నీ మోవిపై మురళీయై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?

 ఆ||

 ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !

తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు ఎంతకీ తిరిగిరాకపోయేసరికి 'ఏమైనదో ఏమో' అని రుక్మిణీదేవీ మనస్సు పలువిధాలుగా ఆలోచిస్తూ, చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.

సీ||

ఏల నా స్వామి రాడెమి కథెమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె,వృద్ధు
డాయాసపడి, దుర్గమారణ్య మార్గమున్    
గడచెనో,కడచినా ,కడలనధిగ
మించి ద్వారకపురమేగెనో ? ఏగిన
మాధవు దర్శన మతనికాయె
నో లేదో,విని ఏమనుకొనెనో మనమున
దయచేయ తలచునో,తలుపడేమొ

గీ||

కలికి ! శ్రీ గౌరి ఏరీతి కరుణగొనునో
వ్రాలు నా తలనేమని వ్రాయబడెనో
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు

రుక్మిణీ కల్యాణం నాటికపై అవధాన చక్రవర్తి, శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ , శతాధిక నాటకకర్త, నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాలను ఇక్కడ జతపరుస్తున్నాం .





  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
Email ThisBlogThis!Share to XShare to Facebook
కొత్తవి పాతవి హోం

0 comments:

Post a Comment


ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • ప్రేమ
    వె న్నెల కురిసెలె , వలపులు విరిసెలె మమతల మాధురిలో మనసులు మురిసెలె                                                             ...
  • మేలుకొలుపు
    శే షాద్రిపై నెలకొన్న శ్రీనివాసా ! ఈ ధాత్రి విషయమై మరచినావా ! నిత్యధూప దీపనైవేద్యాల నిరంతర స్తొత్ర సంకీర్తనల నిను గొల్చి మెప్పించి నీ...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...

భాండాగారం

  • ►  2026 (1)
    • ►  January (1)
  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ▼  April (7)
      • హోదా గోదా !
      • ఛాయచిత్రం-2 - దుర్యోధనుడు
      • ఛాయచిత్రం-1 - తేజసింహుడు
      • రుక్మిణీ కల్యాణం
      • రాగం పలికింది
      • సరసిని
      • నాట్యమయూరి -1
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates