బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Thursday, September 21, 2023

అయ్యో, బాబు !

 September 21, 2023     గేయాలు     No comments   

అయ్యో, బాబు ! అన్యాయానికి బలియైపోతివా?
అక్రమ కేసుల్లోబడి యిరుక్కుపోయితివా !
నేరస్తులు గద్దెనెక్కి పరిపాలన సాగిస్తూ,
నీతిపరుల బంధించి జైలుపాలు చేస్తారా?

జీవనాడి పోలవరానికి జవసత్వాల నందించి
భవితపైన భరోసాను ప్రజలలోన కలిగించి
అమరావతి రాజధాని కంకురార్పణ గావించి
ఆంధ్ర నగ్రగామిజేయ అహర్నిశం శ్రమించావే

నీ దక్షత, దార్శనికత, నిష్కలంక సేవలను
కోరుకున్న ఆంధ్రావని నీకండగ వెంట నిలచెను
మబ్బుల మాటున చంద్రుడు మసకబారినను
గాలిసోకి తొలగిపోవ గగనమంత కాంతి వెలుగును


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Tuesday, March 21, 2023

తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ

 March 21, 2023     No comments   

 జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు. 

శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారి వివరణ ఈ క్లిప్ లో వినండి.(19 నిమిషాల నుండి 41 నిమిషాల వరకు)


శ్రీ గరికపాటి నరసింహారావు గారి వివరణ ఈ  వీడియోలో వినండి (28:10 నిమిషాల నుండి ) 


ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడనే అపవాదుకి మూల కారణం సంస్కృత భారతంలోని శ్లోకంలో "షష్ఠేకాలే" అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో జరిగిన పొరపాటు.  దీనివల్ల చాలా ధార్మిక నష్టం కలిగింది. శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారి, శ్రీ గరికపాటి నరసింహారావు గారి వివరణలు విన్న తర్వాత ఆ పొరపాటును సరిద్దుకోవలసిన అవసరం ఉందనిపించింది . ఆ పొరపాటే జరుగక పోయినట్లైతే మహాభారతంలో "పాంచాల రాజపుత్రియు.." పద్యం, దానిననుసరించి వచ్చిన పాండవోద్యోగములోని " ఏ సతి వహ్నిలోన.." పద్యం ఏ విధంగా వ్రాయబడియుండేడివో అని ఆలోచించాను. కవిబ్రహ్మ శ్రీ తిక్కన సోమయాజి గారికి, కవీశ్వరులైన తిరుపతి వేంకటకవులకు నమస్కరించి, వారి  శైలి, సరళత, నడత, భావగాంభీర్యత, సహజ నాటకీయతా ఔచిత్యములకు భంగము కలుగకుండా వారి పద్యాలకు సవరణ చేయుటకు సాహసించాను. 

 
తిక్కన భారతంలోని ఉద్యోగపర్వం -చతుర్దాశ్వాసంలో శ్రీకృష్ణుడు చెప్పిన పద్యం ఇది.

పాంచాల రాజపుత్రియు,
నంచితముగ నిన్ను బొందునారవ వరుసన్,
సంచితపుణ్యుడ వీవొక
ఇంచుకయును వేరుసేయ కేతెమ్మెలమిన్.

ఈ పద్యంలో రెండవ పాదం మాత్రం  నేను యిలా సవరించాను.

పాంచాల రాజపుత్రియు,
నంచితముగ కొల్చు భక్తి నభిషేకమునన్,
సంచితపుణ్యుడ వీవొక
ఇంచుకయును వేరుసేయ కేతెమ్మెలమిన్.

 తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాతి వహించిన పద్యం.."ఏ సతి వహ్నిలోన జనియించెను" పద్యానికి కూడా సవరణ చేయవలసిన అవసరం ఏర్పడింది.

అసలు పద్యం 

ఏసతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చు వేళ, ము
న్నేసతి పెండ్లినాడు నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే,
నేసతి మీది మోహమున యింతలు జేసిరి రాజు నీవు? ని
న్నాసతి పెండ్లియాడ గల దారవ భర్తగ సూర్యనందనా !

నేను ప్రయత్నించి పై పద్యంలోని రెండవ పాదంలో ' పెండ్లినాడు '  పదాన్ని మరియు చివరి రెండు పాదాలను తగు విధంగా సవరించాను. సవరించిన మార్పులతో పద్యం క్రింద చూడగలరు.

సవరించిన పద్యం 

ఏసతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చు వేళ, ము
న్నేసతి బెండ్లియాడ నృపులెల్ల పరాజితులైరి క్రీడిచే,
నేసతి యీసడించెను, వరించను సూతుని నేనటంచు;ని
న్నాసతి భక్తిగొల్చు వసుధాధిపు జేయగ సూర్యనందనా !


 దీనిపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపవలయునని సవినయంగా కోరుచున్నాను. 


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, January 14, 2023

అన్నమాచార్య నాటకం డౌన్లోడ్ చేసుకోండి

 January 14, 2023     నాటికలు     No comments   

శ్రీ బెల్లంకొండ రత్నం గారు రచించిన 'అన్నమాచార్య ' నాటకాన్ని ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి .

ఈ నాటకం 2013లో జరిగిన గరుడ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలలో "ఉత్తమ రచన" అవార్డు పొందింది. నాటకాన్ని చదివి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపగలరు.

Annamacharya (S) (Natakam 2013) by Bellamkonda Ratnam on Scribd

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
కొత్తవి పాతవి హోం

ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • ప్రేమ
    వె న్నెల కురిసెలె , వలపులు విరిసెలె మమతల మాధురిలో మనసులు మురిసెలె                                                             ...
  • మేలుకొలుపు
    శే షాద్రిపై నెలకొన్న శ్రీనివాసా ! ఈ ధాత్రి విషయమై మరచినావా ! నిత్యధూప దీపనైవేద్యాల నిరంతర స్తొత్ర సంకీర్తనల నిను గొల్చి మెప్పించి నీ...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...

భాండాగారం

  • ►  2026 (1)
    • ►  January (1)
  • ►  2025 (1)
    • ►  June (1)
  • ▼  2023 (3)
    • ▼  September (1)
      • అయ్యో, బాబు !
    • ►  March (1)
      • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
    • ►  January (1)
      • అన్నమాచార్య నాటకం డౌన్లోడ్ చేసుకోండి
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates