బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Sunday, May 30, 2021

పర్యావరణ రక్షణ

 May 30, 2021     గేయాలు     No comments   

చుట్టు పరిసరాలు  శుభ్రముగా ఉంచుకో !
చెట్టు చేమలతో పచ్చదనం నింపుకో !
ప్రకృతి సమతుల్యం పదిలంగా చూసుకో !
భువిని నీ ఉనికి కి భద్రతిదే తెలుసుకో !


విచ్చలవిడి విసర్జన వ్యాధులంట జేయును,
పారవేయు చెత్తలోన సిరులు పొందవచ్చును,
మట్టిగానీ ప్లాస్టీకులు వలదు, హాని కలుగును,
ముందుచూపు ఉంటె చాలు మనుగడ సుఖవంతమౌను,

వాహన పరిశ్రమల వెలువడు వాయువులు,
సేల నీటి వనరుల కలయు విషపదార్థములు,
సకల జీవరాసులు సమసిపోవు ప్రమాదములు,
శాస్త్రీయ నిర్వహణల సమకూరును  శుభములు,

అడవుల స్వార్థానికి ఆహుతిగా చేయకుము,
సామాజిక వనవృద్ధికి సహకరించ మరువకుము,
పర్యావరణ రక్షణలో పుడమి తల్లి క్షేమము,
పుడమి తల్లి వొడిలొనే మన బ్రతుకులు పదిలము.

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, April 11, 2021

ఛాయచిత్రం-4 - శ్రీ వేంకటేశ్వరుడు

 April 11, 2021     ఛాయాచిత్రాలు     No comments   

 


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, April 10, 2021

చదువుకుందాం

 April 10, 2021     గేయాలు     No comments   

 చదువుకుందాం చదువుకుందాం
మనమందరం చదువుకుందాం
చదువులు బాగా చదువుకొని 
ప్రగతిబాటలో పయనిద్దాం   || చదువు


ఆడమగయను తేడాలేక
పేదాసాదను భేదములేక
అందరు ఓకటని ఆనందముగ
ఆడుచుపాడుచు హాయిగ నవ్వుచు   || చదువు


తెలివితేటలను పెంచును చదువు
కలిమిబలిమి కలిగించును చదువు
పేరుప్రతిష్ఠల తెచ్చును చదువు
సుఖశాంతుల సమకూర్చును చదువు   || చదువు


కరుణ ప్రేమగల హృదయమె హృదయము
సత్య ధర్మ సద్వర్తనమే దైవము
మానవత్వమును మించిన మతము
జగతిని లేదని చాటి చెప్పుదాం  || చదువు
  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Saturday, March 6, 2021

రండి ఓటేద్దాం !!

 March 06, 2021     కవితలు     1 comment   

 ఎన్నికైన పిదప ఎవరికీ కనరాక
పైరవీల కోట్ల పడగలెత్తి
ప్రజల బాగులేవి పట్టించుకోనట్టి
నాయకులకు ఓటు వేయతగదు

పదవి లేకున్న ఎన్నడు పాలుమరక
అందుబాటున తానుండి ఆదుకొనుచు
ప్రజలసేవకై నిత్యము పరితపించు
నాయకులకే ఓటు వేయవలను

అయిపు లేకపోయి అయిదేండ్లపుడు వచ్చి
పళ్ళికిలబెట్టి  పలుకరించి
అయ్యా, అమ్మా, మీరలంత బాగేయని
ప్రేమనొలక బోయు పెద్దలొద్దు

అలది కానివైన అవలీలచేయిస్త
చందమామ దించి ముందరుంచుత
ఒక్కసారి నాకు ఓటేసి చూడని
మాయజేయు వారి మాట వినకు

కులమతాలు, ప్రాంతకూటమి గావించి
విందులిచ్చి, త్రాగ మందు పోసి
నోటు చేతపెట్టి,ఓటు కాజేసెడి
నీతిలేని నేత వాత బెట్టు


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, January 17, 2021

నాన్నకు నివాళి !

 January 17, 2021     పద్యాలు     No comments   

 
నాన్నా ! నా కొరకై నీ
వెన్నో బాధలు భరించి యెంతో ప్రేమన్
కన్నులనిడి కాపాడిన
నిన్నే దైవముగ కొల్తు నిరతము భక్తిన్

ఆ దైవమెందుకొ పురిట
నా తల్లిని తన్నుకెళ్ళె నారునెలలకే !
నా దైవమీవె నాన్నా !
నీ దీవెనలిమ్ము నాకు నిండుగ నెపుడున్

నీతో ఆటలు,పాటలు,
నీతో గడపిన క్షణములు, నీ భాషణముల్
నీ తీయని జ్ఞాపకములు
నా తోడుగ నిల్పి నన్ను నడిపించుమయా

నీ ధైర్యసాహసములును,
నీ ధర్మపరాయణతయు, నీ భూతదయున్
నీ ధైవభక్తి,శ్రద్ధయు
కొంతైనను నాకొదువగ కోరితి వరమున్

కనులను నీ రూపము కన
వినులను నీ మృదువచనము విన,చేతల నీ
పనితనము, శ్రద్ధయు నిలిపి
నను కరుణను జూడగోరు నామది నాన్నా !

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
కొత్తవి పాతవి హోం

ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • ప్రేమ
    వె న్నెల కురిసెలె , వలపులు విరిసెలె మమతల మాధురిలో మనసులు మురిసెలె                                                             ...
  • మేలుకొలుపు
    శే షాద్రిపై నెలకొన్న శ్రీనివాసా ! ఈ ధాత్రి విషయమై మరచినావా ! నిత్యధూప దీపనైవేద్యాల నిరంతర స్తొత్ర సంకీర్తనల నిను గొల్చి మెప్పించి నీ...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...

భాండాగారం

  • ►  2026 (1)
    • ►  January (1)
  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ▼  2021 (5)
    • ▼  May (1)
      • పర్యావరణ రక్షణ
    • ►  April (2)
      • ఛాయచిత్రం-4 - శ్రీ వేంకటేశ్వరుడు
      • చదువుకుందాం
    • ►  March (1)
      • రండి ఓటేద్దాం !!
    • ►  January (1)
      • నాన్నకు నివాళి !
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ►  2019 (5)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates