బెల్లంకొండ రత్నం

  • పరిచయం
  • చిత్రలేఖనం
  • కవితలు
  • గేయాలు
  • పద్యాలు
  • నాటికలు
  • ఛాయాచిత్రాలు

Saturday, October 19, 2019

ప్రణయరాగం

 October 19, 2019     గేయాలు     No comments   


అతడు:  ఏకాంత సమయము, ఇంకేల బిడియము ?
             అందించు అందము,  అలరించు డెందము

ఆమె:    కథలేవో అల్లకు, కౌగిళ్ళ చేరకు
            నా బుగ్గ గిల్లకు, నును సిగ్గు దోచకు

                                                                                  ఏకాంత||
అతడు:  అయ్యారె చిత్రము, ఆ కళ్ళే మంత్రము
             మురిపించు అందము, ముంగాళ్ళ బంధము

ఆమె:    కొంగుపట్టు  లాగకు, గుండె తట్టి లేపకు
            చెంప చెంప రాయకు, చిచ్చు నాలో రేపకు

                                                                                  ఏకాంత||
అతడు:  విరహాల వేడిలో కరిగేను కాలము
            నీ ప్రణయదాసుని కరుణించి బ్రోవుము

ఆమె:    ప్రణయానుబంధము, పులకించు హృదయము
           ఎంతెంత మధురము, దిగివచ్చె స్వర్గము

                                                                               ఏకాంత||

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Tuesday, September 10, 2019

చెట్టు నాటుదాం మామా

 September 10, 2019     గేయాలు     No comments   

చెట్టు నాటుదాం మామా
చెట్లు పెంచుదాం పిల్లా
చెట్టు నాటుదాం మామా
చెట్లు నాటుదాం పిల్లా
మన ప్రేమకు గుర్తుగా
మన పెళ్ళికి సాక్షిగా
పచ్చని చెట్టు నాటి పదిలంగా పెంచుదాం
పదిలంగా పెంచుదాం
                                                    || చెట్టు నాటుదాం
రాళ్ళను విసిరినా పళ్ళను రాల్చుతూ
చివురులు చిదిమినా పువ్వులు పూయుచూ
తరతమ బేధాలు తలపుకు రానీక
అందరినీ చల్లగా ఆదరించు చెట్టు తల్లి
                                                     || చెట్టు నాటుదాం
ఆహరమందించి పొషించు మనిషిని
మందుగా రూపొంది రక్షించు జీవుని
అవసరానికి ఆదుకొని తలపించు దేవుని
చేతులెక్కి మొక్కుదాం చెట్టు తల్లి దిక్కని
                                                      || చెట్టు నాటుదాం
ఇంటింటా చెట్టు ఇంటిముందు చెట్లు
వీధివాడ చెట్లు రహదారులందు చెట్లు
అడుగడుగున పచ్చదనం అందంగా దిద్దుదాం
ఆ తల్లి రుణం కొంతైనా ఈ తీరుగ తీర్చుదాం
                                                      || చెట్టు నాటుదాం

ఈ పాటను క్రింది లంకెలో వినండి


  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Friday, August 2, 2019

భాగ్యవిధాతలు

 August 02, 2019     కవితలు     No comments   

బాలల్లారా ! భావి భారత పౌరుల్లారా !
భాగ్యవిధాతలు మీరే,  భారత
భాగ్యవిధాతలు మీరే !

కాయగసురులు తిన్న బాలభరతుడు
కౄరమృగాల కోరలు దీసిన వీరుడు
కాఫీకల్చరుతో కళ్ళు తెరచు పిల్లలు
షోకేసు బొమ్మల్లా చేవజిక్కిపోయారా ?

ఏ గురువు వల్ల ఏకలవ్యుడంతటి విలుకాడయ్యాడు
ఎందరు బోధించినా మీరెందుకు కొరగాకున్నారు ?
మరువకండి, విద్యాబుద్ధులే మీ ప్రగతికి సోపానాలు !
మీ చిరునవ్వులే జాతికి చెరగని సిరిసంపదలు !

ఏ మహిమ వల్ల గగనాల తారగ వెలగెను ధృవుడు ?
ఏ శక్తి వల్ల మృత్యువు నెదరించె మార్కండేయుడు ?
ఆ మహనీయులు ఆదర్శంగ అడుగు ముందుకు వేయాలి
బాపూ, చాచా, నేతాజీల బంగారు కలలు పండించాలి

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Sunday, February 3, 2019

గువ్వల జంట

 February 03, 2019     గేయాలు     No comments   

సక్కనైన సుక్కంట
సూస్తేనే సురుకంట..ఓలమ్మో
ఏమిటో ఈ మంట
అంటుకుంటె ఆరదంట

ఆకతాయి పిల్లడంట
అగుపిస్తే ఆగడంట..ఓరయ్యో
ఏమిటో ఈ తంట
తగులుకుంటే వదలదంట

గువ్వల్లె సూసుకుంట
గుండెల్లో దాచుకుంట
రాయే నా వెంట
నీవే నా ఎలుగంట

నీ నీడే మేడంట
నవ్వులే సిరులంట
నువ్వే నా నోము పంట
నిన్నిడిసి పోనంట

బుసకొట్టే ఈడంట
బిగుతు రైక ఆగదంట
జవ్వాడే నడుము వెంట
తిరుగాడే మనసు తంట

  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg

Monday, January 14, 2019

స్వాతంత్ర్యం వచ్చిందంటే

 January 14, 2019     కవితలు     No comments   

స్వాతంత్ర్యం వచ్చిందంటే నాడు
సంతోషంతో గంతులు వేశాను

అందరానిదేదో అరచేతికి చిక్కినట్లు
స్వర్గం దిగివచ్చి స్వాగతం పలికినట్లు
బ్రతుకు పండి పున్నమై పూసినట్లు
సంతోషంతో గంతులు వేశాను

రెక్కలు విప్పి రివ్వున నింగికెగసి పోవాలని
ఆసేతు హిమాచలం హాయిగ విహరించాలని
పచ్చని భూపొత్తిళ్ళలో వెచ్చగ పవళించాలని
సంతోషంతో గంతులు వేశాను -కాని

అర్థం అధికారం అతివా సాంగత్యం
పరమార్థంగా కల పెద్దమనుషుల స్వార్థం
పడగ విప్పి బుసలుకొట్టి  పిశాచాలై  పీక్కుతూంటే
అక్రమం అన్యాయం అంధకారమై అలముకుంటే

దగా  దోపిడి  దావానలమై  దరికొంటే
కులతత్వం మతమౌఢ్యం కరాళనృత్యం చేస్తూంటే
స్థలవాదం సమవాదాన్ని సవాలు చేస్తూంటే
మమత మానవత్వం మంటగలసిపోతూంటే

నోరు మెదపలేక కాలు కదపలేక
కాలే కడుపును కన్నీటితో తడుపలేక
పగిలిన గుండెను పొదివి పట్టుకొని
ఎందుకొచ్చిందీ స్వాతంత్ర్యమని ఏడ్వలేక చస్తున్నా !
ఎక్కడుందో స్వాతంత్ర్యమని దిక్కు దిక్కులు చూస్తున్నా !!
 
  • షేర్ చెయ్యండి :  
  •  Facebook
  •  Twitter
  •  Google+
  •  Stumble
  •  Digg
కొత్తవి పాతవి హోం

ప్రముఖ టపాలు

  • పరిచయం
    శ్రీ  బెల్లంకొండ రత్నం  గారు  చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రచయిత, చిత్రకారుడు, రంగస్థల నటుడు.   వృత్తిరీత్యా శానిటరీ సుపర్వైసర్‌...
  • అయ్యో, బాబు !
    అ య్యో, బాబు ! అన్యాయానికి బలియైపోతివా? అక్రమ కేసుల్లోబడి యిరుక్కుపోయితివా ! నేరస్తులు గద్దెనెక్కి పరిపాలన సాగిస్తూ, నీతిపరుల బంధించి జైలుపా...
  • తిక్కన, తిరుపతి వేంకటకవుల ప్రఖ్యాత పద్యాలకు సవరణ
     జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నట్లు ద్రౌపది ఆరవ భర్తగా కర్ణున్ని స్వీకరిస్తుందని శ్రీకృష్ణుడు ఏనాడూ అనలేదు.  శ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రి గ...
  • గిట్టుధర
    వె లనీక రైతు భూమికి, వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్ వెలనీయక కష్టమునకు, వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ! వెల వెక్కిరింత తాలక, క...
  • ఆరోగ్యగీత
    ఆ రోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ? ఆరోగ్యంగా ఉండటమంటే రోగాలు రాకుండా ఉండటమేనా ? వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ? వాటి నివారణకు తీసుకోవల్సిన జ...

భాండాగారం

  • ►  2025 (1)
    • ►  June (1)
  • ►  2023 (3)
    • ►  September (1)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2022 (4)
    • ►  July (1)
    • ►  March (1)
    • ►  February (1)
    • ►  January (1)
  • ►  2021 (5)
    • ►  May (1)
    • ►  April (2)
    • ►  March (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  December (1)
    • ►  November (1)
  • ▼  2019 (5)
    • ▼  October (1)
      • ప్రణయరాగం
    • ►  September (1)
      • చెట్టు నాటుదాం మామా
    • ►  August (1)
      • భాగ్యవిధాతలు
    • ►  February (1)
      • గువ్వల జంట
    • ►  January (1)
      • స్వాతంత్ర్యం వచ్చిందంటే
  • ►  2018 (21)
    • ►  November (2)
    • ►  October (1)
    • ►  September (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (2)
    • ►  May (3)
    • ►  April (7)
    • ►  March (3)

పేజి వీక్షణలు

బ్లాగు సమూహాలు

మాలిక: Telugu Blogs
”శోధిని”
koodali.club

Copyright © బెల్లంకొండ రత్నం | Powered by Blogger
Design by Hardeep Asrani | Blogger Theme by NewBloggerThemes.com | Distributed By Gooyaabi Templates