గీ|| శిశువు బ్రతికించ గర్భము చీల్చివైచి
తల్లి గాపాడు బాధ్యత తలుపరైరి,
యండదండగ మేముందు మాంధ్రకనుచు
మాయమాటల మా గొంతు కోయతగునె?
ఆ|| కీడు జేయువారి కించెత్తు పడనీక
యెదిరి పోరువాని కేడ్వతగునె ?
కలసికట్టు నిలచి కలబడ్డ విజయమ్ము .
పొరుగుజూసియైన బుద్ధిరాదె !
ఆ|| పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీలు
తోడునిల్చి పోర కూడిరాగ,
నాంధ్రులందె చూడ నైక్యత కరువాయె .
హోద వచ్చుటెట్లొ బోధపడదు .
ఆ|| రాజకీయమెపుడు రాక్షస క్రీడైన
ప్రజల హాని దలుప పాడియౌనె ?
పదవి కొరకు ప్రజల భవితను బలిజేయు
నీచ నాయకులను పీచమడచు .
dear sir very good blog and very good content
ReplyDeleteTelugu News