వెలనీక రైతు భూమికి,
వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్
వెలనీయక కష్టమునకు,
వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ!
వెలనీయక నీటివనరు విద్యుత్తులకున్
వెలనీయక కష్టమునకు,
వెలగట్ట పంటకెటులొ విజ్ఞులకెరుకౌ!
వెల వెక్కిరింత తాలక,
కులబోసిరి పంట దార్ల కోపము రగులన్,
తలచిన కూలియు రాదని,
పొలముననే వదలి రైతు బోరున పొగిలెన్.
గిట్టుధర రైతు కిచ్చిన,
పెట్టున ద్రవ్యోల్బణము పెట్రేగనుచున్,
కట్టడి చేయు దొరల కను,
గట్టదె పారిశ్రమపరి కపటపు చేతల్?
నేతల కోతలు, ప్రభుతల
చేతలు సుంతయిన మేలు చేయక పోయెన్.
ఘాతుక దళారి బాధల,
రైతులు కూలిపని కోర్చి రకటా ధరణిన్!
ఉత్తుతి బాసలు సేయక,
చిత్తముతో భద్రభూమి, స్థిరజలవనరుల్,
విత్తన,విద్యుతు మేలుగ
రైతుకొసగు చాలు,రామరాజ్యము రాదే!
0 comments:
Post a Comment