చెట్టే సంపద హోయ్
చెట్టే దేవతా హోయ్
చెట్లు పెంచితే చింత తీరు రా
చెట్లు పెంచితే చింత తీరు రా ..హె హేయ్
చెట్టే సంపద హోయ్
చెట్టే దేవతా హోయ్
చెట్లు పెంచితే చింత తీరు రా
చెట్లు పెంచితే చింత తీరు రా
చెట్లు పెంచితే చింత తీరు రా
లాయి లల్లాయి లే
లాయి లల్లాయి లే హేయ్
లాయి లల్లాయి లే
లాయి లల్లాయి లే
|| చెట్టే సంపద
విత్తు మొదలుగా వేరు చివురును
వేయి విధముల కాయపడతది
విత్తు మొదలుగా వేరు చివురును
వేయి విధముల కాయపడతది
పరుల కొరకే బ్రతుకునంతయూ
పరుల కొరకే బ్రతుకునంతయూ ధారపోసెడి త్యాగి వృక్షము
పరుల కొరకే బ్రతుకునంతయూ ధారపోసెడి త్యాగి వృక్షము
పరుల కొరకే బ్రతుకునంతయూ ధారపోసెడి త్యాగి వృక్షము
|| చెట్టే సంపద
ఎంత చేసినా ఏమి ఇస్తివని
ఈదులకీడ్చే మనుషుల కన్నా..హె...హేయ్
ఎంత చేసినా ఏమి ఇస్తివని
ఈదులకీడ్చే మనుషుల కన్నా
పెంచిన చెట్టే మంచి చేస్తది హా...అఆ
పెంచిన చెట్టే మంచి చేస్తది
అవసరాలలో ఆదుకొంటది
పెంచిన చెట్టే మంచి చేస్తది
అవసరాలలో ఆదుకొంటది
పెంచిన చెట్టే మంచి చేస్తది
అవసరాలలో ఆదుకొంటది
|| చెట్టే సంపద
వడ్డీకిస్తే అసలూడిందని
లబోదిబోయని అఘోరించకు
వడ్డీకిస్తే అసలూడిందని
లబోదిబోయని అఘోరించకు
చెట్లను పెంచి ప్రోది చేస్తివా హా...అఆ
చెట్లను పెంచి ప్రోది చేస్తివా
ఇబ్బడి ముబ్బడి రాబడిస్తది
చెట్లను పెంచి ప్రోది చేస్తివా
ఇబ్బడి ముబ్బడి రాబడిస్తది
|| చెట్టే సంపద
0 comments:
Post a Comment