చదువుకుందాం చదువుకుందాం
మనమందరం చదువుకుందాం
చదువులు బాగా చదువుకొని
ప్రగతిబాటలో పయనిద్దాం || చదువు
మనమందరం చదువుకుందాం
చదువులు బాగా చదువుకొని
ప్రగతిబాటలో పయనిద్దాం || చదువు
ఆడమగయను తేడాలేక
పేదాసాదను భేదములేక
అందరు ఓకటని ఆనందముగ
ఆడుచుపాడుచు హాయిగ నవ్వుచు || చదువు
పేదాసాదను భేదములేక
అందరు ఓకటని ఆనందముగ
ఆడుచుపాడుచు హాయిగ నవ్వుచు || చదువు
తెలివితేటలను పెంచును చదువు
కలిమిబలిమి కలిగించును చదువు
పేరుప్రతిష్ఠల తెచ్చును చదువు
సుఖశాంతుల సమకూర్చును చదువు || చదువు
కలిమిబలిమి కలిగించును చదువు
పేరుప్రతిష్ఠల తెచ్చును చదువు
సుఖశాంతుల సమకూర్చును చదువు || చదువు
కరుణ ప్రేమగల హృదయమె హృదయము
సత్య ధర్మ సద్వర్తనమే దైవము
మానవత్వమును మించిన మతము
జగతిని లేదని చాటి చెప్పుదాం || చదువు
సత్య ధర్మ సద్వర్తనమే దైవము
మానవత్వమును మించిన మతము
జగతిని లేదని చాటి చెప్పుదాం || చదువు
0 comments:
Post a Comment